'ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా'

'ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా'

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సోమ రజిని రాజశేఖర్ తమ తొలి నామినేషన్ పత్రాన్ని ఇవాళ దాఖాలు వేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన ఉద్యోగాన్ని సైతం వదిలి ప్రజాసేవ కోసం మీ ముందుకు వస్తున్నానని అన్నారు. ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే... అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కాగా, ఛైర్మన్ బరిలో ఆమె ఉన్నట్లుగా స్ధానికులు చర్చించుకుంటున్నారు.