VIDEO: నరసాపురంలో జాతీయ రహదారిపై ధర్నా..!

VIDEO: నరసాపురంలో జాతీయ రహదారిపై ధర్నా..!

W.G: నరసాపురంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో తమ బంధువు మరణించాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఇవాళ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. మొగల్తూరుకు చెందిన ఫణేంద్ర రోడ్డు ప్రమాదంలో గాయపడగా, నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు సరిగా పట్టించుకోలేదని, దీంతో భీమవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని బంధువులు తెలిపారు.