సొంతింటి కల నెరవేర్చటమే ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్
SRCL: నిరుపేదలకు స్వంత ఇంటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆన్నారు. చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని, లబ్ధిదారులకు గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేసి, నూతన వస్త్రాలను అందజేశారు.