చార్‌ధామ్ యాత్ర.. భారత్ గౌరవ్ రైలు ప్రారంభం

17 రోజుల చార్‌ధామ్ యాత్ర కోసం ప్రత్యేకంగా భారతీయ రైల్వే 'భారత్ గౌరవ్ డీలక్స్' రైలును ప్రారంభించింది. ఈ రైలు మే 27న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 8,425 కి.మీల దూరం ప్రయాణించి చార్‌ధామ్(బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్)తో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తుంది. టిక్కెట్లు IRCTC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.