VIDEO: 15 మంది మావోయిస్టు అనుచరులను అరెస్ట్
ఏలూరు గ్రీన్ సిటీ ప్రాంతంలో నిన్న పోలీసులు 15 మంది మావోయిస్టు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. వీరు మావోయిస్టు సెంట్రల్ కమిటీ అనుచరులుగా అనుమానిస్తున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. వీరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు వచ్చారా? లేక తల దాచుకునేందుకు వచ్చారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.