ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్

KMM: నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె ఆసుపత్రిలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, వైద్యులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రాజశేఖర్ గౌడ్, తదితరులు ఉన్నారు.