ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి
కోనసీమ: రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అని నినదించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పీ.రాజశేఖర్ పాల్గొన్నారు.