తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

PDPL: పెద్దపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. భూమి సర్వే చేసి పంచనామా ఇవ్వడానికి సర్వేయర్ సునీల్ బాధితుని నుంచి తన అసిస్టెంట్ ద్వారా 10 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా వసూలు చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు సర్వేయర్ సునీల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.