ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

GNTR: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు చివరి తేది ఈ నెల 5గా ప్రభుత్వం పొడిగించింది. ఈ విషయాన్ని కృష్ణా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సల్మాన్ రాజు ప్రకటించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి.