ట్రాక్టర్ టైర్ కింద పడి కూలి మృతి.. కేసు నమోదు

ట్రాక్టర్ టైర్ కింద పడి కూలి మృతి.. కేసు నమోదు

SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామంలో ఓ కూలి ట్రాక్టర్ టైర్ కింద పడి మృతి చెందాడని సిర్గాపూర్ SI నారాయణ ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన భాగయ్య (45) శనివారం కూలి పనికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా, ఆగి ఉన్న ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి భాగయ్య ఎక్కుతుండగా ట్రాక్టర్ ముందుకు కదిలి ప్రమాదవశాత్తు టైర్ కింద పడి మృతి చెందాడని SI తెలిపారు.