శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ప్రారంభం

శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ప్రారంభం

TPT: తిరుమల ధర్మగిరిలోని శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో భక్తుల ఐశ్వర్యం, ఆయురారోగ్య సంపదలు కాంక్షిస్తూ ఆదివారం సాయంత్రం శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ప్రారంభమైంది. ఈ మహాయాగం ఆగస్టు 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించబడుతుంది. తొలి రోజు సాయంత్రం 6 గంటలకు ఆచార్యవరణం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం, వేదారంభం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.