ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
పెద్దపల్లి మండలం ధర్మారం ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని పెద్దపల్లి మండలం అందుగులపల్లికి చెందిన పిడుగు గోపాల్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.