పెందుర్తి: వైసీపీలోకి భారీగా చేరికలు

విశాఖ: పెందుర్తి నియోజవర్గం 92వ వార్డు బంట కాలనీలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ సమక్షంలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు వైసీపీలో చేరారు. శనివారం బంతా కాలనీలో జనసేన, టీడీపీ కార్యకర్తలు పెందుర్తి ఎమ్మెల్యే అదిప్ రాజ్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు పాల్గొన్నారు.