'పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం'
VZM: అకాల వర్షాలు, ఈదురు గాలులు కారణంగా చేతివరకు వచ్చిన పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్బంగా బొబ్బిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. నివేదికను సత్వరమే తయారుచేయాలని కోరారు.