VIDEO: అల్లినగరంలో ఘనంగా రాముల వారి కళ్యాణం
SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో శ్రీ కోదండ రామాలయంలో రాముల వారి కళ్యాణం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. గుంటుకు వాసుదేవరావు, మాడుగుల సూర్య ప్రకాష్ దంపతులు కళ్యాణం చేశారు. ఆలయ అర్చకులు చామర్తి వాసు, కిరణ్ కుమార్, శరత్ కుమార్, పరుపు రమణ, విజయబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.