అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్ ఉక్కుపాదం
VKB: ఇసుక అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. అనుమతి లేని ఇసుక వాహనాలను తప్పనిసరిగా సీజ్ చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ శాఖల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.