భారీ వర్షాల దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలింపు

SDPT: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో ఇళ్లు ధ్వంసమైన ప్రజలకు మున్సిపల్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేలుకు మున్సిపల్ సిబ్బంది అన్ని వార్డుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని సూచనలు చేశారు.