లబ్ధిదారులకు గృహపత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
సత్యసాయి: కదిరిలో పీఎంఏవైయూ 2.0 కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరై లబ్ధిదారులకు ఇంటి పత్రాలు పంపిణీ చేశారు.అనంతరం స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కమిషన్ డైరెక్టర్ పర్వీన్ బాను, మున్సిపల్ ఛైర్మన్ దిల్షాద్ ఉన్నీసా, అధికారులు, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.