VIDEO: అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
VSP: సబ్బవరం, పరవాడ మండలాల పంచాయతీ ప్రత్యేక అధికారులతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, అలాగే, పశుగ్రాసం కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.