హిందూ సమ్మేళనం కరపత్రాల ఆవిష్కరణ
PDPL: ఎలిగేడు మండల కేంద్రంలో ఈనెల 26న హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ భవాని రామలింగేశ్వర హిందూ సమితి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రామాలయంలో నిర్వాహకులు కరపత్రాలు ఆవిష్కరించారు. మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.