పాఠశాల భూమి ఆక్రమణపై ఎండీవోకు వినతి
MBNR: మిడ్జిల్ మండలంలోని రాణిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భూమి అక్రమకు గురవుతుందని పాఠశాల సిబ్బంది ఆరోపించారు. సుమారు 2 ఎకరాల పాఠశాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి, పాఠశాలకు దారి లేకుండా చేస్తున్నారని వాపోయారు. ఈ క్రమంలో వెంటనే సర్వే నిర్వహించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, పాఠశాల HM మోహన్, సిబ్బంది, AAPC ఛైర్మన్ వసంత ఎండీవోకు వినతిపత్రం సమర్పించారు.