‘నేను మోదీని కొంచెం ఎక్కువగా ప్రేమిస్తున్నాను’

‘నేను మోదీని కొంచెం ఎక్కువగా ప్రేమిస్తున్నాను’

లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రధాని మోదీకి తన మద్దతును పునరుద్ఘాటించారు. 'నేను ఆయనను కొంచెం ఎక్కువగా ప్రేమిస్తున్నాను' అని, ఆయన నుంచి విడిపోలేనని పాశ్వాన్ నొక్కిచెప్పారు. బీహార్ ఎన్నికల తర్వాత పొత్తు మారుతారన్న వార్తలను తోసిపుచ్చుతూ, తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, NDAలోనే ఉంటానని స్పష్టం చేశారు. మోదీ ఉన్నంత వరకు తాను ఎక్కడికీ వెళ్లనని తేల్చి చెప్పారు.