భక్తులను ఆకర్షిస్తున్న మల్లికార్జున స్వామి ఆలయం
MDK: వెల్దుర్తి మండలం బస్వాపూర్‌లోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయం ప్రాచీన చరిత్ర కలిగినదిగా జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. 49వ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ దేవాలయం ఆధ్యాత్మికంగా విశిష్టమైనదిగా, పురాణాల ప్రకారం మునులు ఇక్కడ తపస్సు చేసినట్టు విశ్వాసం ఉందన్నారు.