'పోలీసుల నిబంధనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు'

WGL: రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణేష్ నవరాత్రి ఉత్సవాలను పోలీసులు సూచించిన నిబంధనలు పాటిస్తూ.. భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఈ మేరకు మండప నిర్వాహకులు పాటించాల్సిన నియమావళిపై ఆయన పలు సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.