నిజామాబాద్ మార్కెట్‌కు భారీగా పసుపు: తుమ్మల

నిజామాబాద్ మార్కెట్‌కు భారీగా పసుపు: తుమ్మల

TG: నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు భారీగా వస్తోందని మంత్రి తుమ్మల వెల్లడించారు. 1,500 టార్పాలిన్ల పంపిణీ కోసం బిడ్డింగ్ పూర్తి చేశామన్నారు. పసుపు కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మేలు రకం పసుపు పంటకు ప్రభుత్వం ఖరారు చేసిన ధర చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులకు చెల్లింపులు సక్రమంగా జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.