అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్ సీజ్

అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్ సీజ్

KNR: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద గొల్లపల్లి గ్రామం సుల్తానాబాద్ మండలానికి చెందిన దాసరి సంపత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ని సీజ్ చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.