మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థి సూసైడ్
NZB: చందూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి షేక్ మూస గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు, తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలకు త్వరలో వెల్లడిస్తామని ఎస్సై సాయన్న సోమవారం తెలిపారు.