కారుమూరి వ్యాఖ్యలను ఖండించిన రైతులు

W.G: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకోవాలని ఇరగవరం మండలం రైతులు హితవు పలికారు. సోమవారం ఇరగవరం సొసైటీ ఛైర్మన్ వేండ్ర నాగరాజేశ్వరరావు ఆధ్వర్యంలో సొసైటీ గొడౌన్ వద్ద కారుమూరి వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు. తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై అసత్య ఆరోపణలు సరికాదని అన్నారు. కారుమూరి ఆరోపిస్తున్నట్లుగా ఎక్కడ ఎరువుల కొరత లేదని అన్నారు.