మేడారంలో బాలుడిపై పడిన రాతికట్టడం
TG: మేడారంలో అపశృతి చోటుచేసుకుంది. సమ్మక్క ప్రధాన పూజారి సద్ధబోయిన రానా రమేష్ కుమారుడు యువన్ సమ్మక్క గద్దె దగ్గర ఆడుకుంటుండగా రాతి కట్టడంలోని రాయి కాలు మీద పడి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడిని హుటాహుటిన వరంగల్‌లోని గార్డియన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కాలు సర్జరీ చేసిన మునుపాటి స్థితికి వచ్చే అవకాశం లేకపోవడంతో వైద్యులు కాలును తొలగించారు.