జిల్లాలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
SRCL: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదంటూ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వేములవాడ ఆర్టీసీ డిపో ముందు కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.