అమరావతిలో మరో అగ్నిప్రమాదం

అమరావతిలో మరో అగ్నిప్రమాదం

AP: అమరావతిలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తూళ్లూరుపేట దగ్గర మంటలు చెలరేగాయి. నిర్మాణ సామాగ్రిని తీసుకొచ్చిన ట్రాలీలో సిబ్బంది వంట చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 10 రోజుల క్రితం మెటీరియల్ తీసుకొచ్చిన ట్రాలీ క్యాబిన్‌లో మంటలు రావడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అప్పటికే మంటల్లో క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది.