ఆత్మకూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాజీనామా

ఆత్మకూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాజీనామా

KRNL: ఆత్మకూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ డా. మారూఫ్ ఆసియా తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం కమిషనర్ ఓబులేసుకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇటీవల ఆమె ఆత్మకూరు అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్‌గా ఎంపిక కావడంతో తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఈ నెల 18తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఆమె రాజీనామా చేసినట్లు తెలిపారు.