VIDEO: ద్విచక్ర వాహనాదారులు హెల్మెట్ ధరించాలి: ట్రాఫిక్ ACP
హనుమకొండలోని అదాలత్ జంక్షన్‌లో శనివారం ట్రాఫిక్ పోలీసులు "ARRIVE AND ALIVE" రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో రహదారి నిబంధనల పై ప్రజలను హెచ్చరించారు. ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ ACP సత్యనారాయణ హాజరై, మాట్లాడారు. ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.