నూతన సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

నూతన సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

MBNR: కోయిల్‌కొండ మండలంలోని రాంపూర్, కోయిలకొండ, అంకిళ్ల గ్రామాలలో రూ.10.50 కోట్లతో మంజూరైన 33/11 సబ్ స్టేషన్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా ఇన్ని సబ్ స్టేషన్లు ఒకే దఫాలో మంజూరైన దాఖలాలు లేవని ఆమె అన్నారు. అధిక ఓల్టేజీ సమస్య వల్ల తరచూ మోటార్లు కాలిపోతూ ఉండేవని, ఇక ఆ సమస్య ఉండదన్నారు.