నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GWDL: మానవపాడు విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని గ్రామాలకు గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సుబ్బరాయుడు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33 కేవీ మానవపాడు ఫీడర్ కింద ఉన్న లైన్‌కు తాకే చెట్ల కొమ్మలను తొలగించటానికి లైన్ క్లియర్ తీసుకుంటామని విద్యుత్ ఏఈ తెలిపారు. కావున ఆ సమయంలో వినియోగదారులకు సహకరించాలని ఆయన కోరారు.