వైద్య విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేసిన హరీష్ రావు
HYD: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఏడాది మొత్తం 122 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా మరో ఏడుగురు వైద్య విద్యార్థులకు ఫీజు చెక్కులను పంపిణీ చేయించారు. పేద విద్యార్థుల డాక్టర్ కల నిజం చేస్తున్న లక్ష్మారెడ్డి సేవలను ఈ సందర్భంగా హరీష్ రావు కొనియాడారు.