నగరంలో సరస్వతీ దేవిగా దుర్గాదేవి అమ్మవారు
GNTR: తూర్పు నియోజకవర్గంలోని సంగడిగుంట పొన్నూరు రోడ్‌లో జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.