గ్రామాల్లో పారిశుద్ధ్యం పాటించాలి: కలెక్టర్

బాపట్ల కలెక్టర్ వెంకట మురళి బుధవారం సీజనల్ వ్యాధులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం కట్టుదిట్టంగా పాటించాలన్నారు. ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల ఉత్పత్తి నియంత్రించాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీల వద్ద శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.