బట్టుపల్లి చౌరస్తాకు మాజీ MLA కావేటి సమ్మయ్య పేరు
ASF: కాగజ్ నగర్ బట్టుపల్లి చౌరస్తా వద్ద తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ MLA కావేటి సమ్మయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆ ప్రాంతానికి కావేటి సమ్మయ్య చౌరస్తాగా నామకరణం చేసిన బోర్డును MLC దండే విఠల్ గురువారం ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ కావేటి సమ్మయ్యకి గౌరవాన్ని అందించిందన్నారు.