'త్వరలో రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం'

SS: పెనుకొండ 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్ త్వరలో పూర్తి చేస్తామని మంత్రి సవిత అన్నారు. సోమవారం NH అధికారులతో కలిసి మంత్రి సర్వీస్ రోడ్‌ను పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రోడ్ పనులు పట్టించుకోలేదన్నారు. ఈ సమస్యను పలుసార్లు కేంద్ర రవాణా శాఖ మంత్రులు నితిన్ గడ్కరీకి విన్నవించగా.. నిధులు మంజూరు చేశారన్నారు. అనంతరం కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.