వరద బాధితులను పరామర్శించిన రేవంత్

వరద బాధితులను పరామర్శించిన రేవంత్

TG: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సమ్మయ్యనగర్‌లో వరద బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అంతకుముందు హుస్నాబాద్, హన్మకొండ, వరంగల్‌లో ఏరియల్ సర్వే చేశారు.