బాధ్యతలు చేపట్టిన అన్నాజీ రావు
శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన సనపల అన్నాజీ రావు శ్రీకాకుళం పట్టణంలోని ఇందిరా విజ్ఞాన భవన్‌లో ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయటం లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.