'ఆధునికత వైపు అన్నదాతలు రావాలి'

'ఆధునికత వైపు అన్నదాతలు రావాలి'

VZM: ఆధునికత వైపు అన్నదాతలు అందరూ రావాలని గజపతినగరం మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ కోరారు. బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా గజపతినగరం మండలంలోని జిన్నాం గ్రామంలో ఆత్మ సౌజన్యంతో డ్రోన్ తో పురుగుల మందు పిచికారి చేసే విధానం రైతులకు చూపించారు. ఆధునిక విధానం అవలంబించడం ద్వారా ఖర్చు తగ్గించి అధిక దిగుబడులు సాధించవచ్చు అని చెప్పారు.