'మరిన్ని కేసుల పరిష్కరించాలి'

GDWL: జూన్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులను రాజీ ద్వారా పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సూచించారు. శుక్రవారం గద్వాల కోర్టు ప్రాంగణంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన న్యాయమూర్తి, ఠాణాల వద్ద ఉండే కేసులు కోర్టులోకి రాకుండానే ఇరు పక్షాల సమన్వయంతో పరిష్కరించడానికి ప్రయత్నించాలన్నారు.