హోలీ.. బట్టలపై రంగు పడిందా?
హోలీ సంబరాల్లో ఖరీదైన దుస్తులపై పడే మొండి రంగుల మరకలను తొలగించడం ఇప్పుడు సులభం. రంగుపడిన వెంటనే వేడినీరు కాకుండా చల్లటినీటితో కడగాలి. మొండి మరకల కోసం వెనిగర్, డిటర్జెంట్ ద్రావణంలో నానబెట్టడం లేదా బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమంతో రుద్దడం వంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. తెల్లటి బట్టలపై చిన్న మరకలకు టూత్ పేస్ట్ కూడా వాడవచ్చు.