'విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడం అభినందనీయం'

'విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడం అభినందనీయం'

W.G: మూడు సంవత్సరాలగా భీమవరం బాల ఉత్సవాల పేరుతో విద్యార్థులకు అనేక రకాల పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీస్తున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపి మూర్తి అన్నారు. శుక్రవారం యూటీఎఫ్ కార్యాలయంలో ఆయన ఉత్సవాల బ్రోచర్ ఆవిష్కరించారు. డిసెంబర్ 12, 13న ఈ ఉత్సవాలు SRKలో చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.