గోరంట్లలో కర్ణాటక మద్యం సీజ్

గోరంట్లలో కర్ణాటక మద్యం సీజ్

సత్యసాయి: గోరంట్ల మండలం కోరేవాండ్లపల్లి క్రాస్ వద్ద శనివారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. కర్ణాటక నుండి కారులో మద్యం తరలిస్తున్న నల్లమాడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ సృజన బాబు తెలిపారు. వారి వద్ద నుంచి 1728 కర్ణాటక మద్యం ప్యాకెట్లను సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను రిమాండ్ పంపినట్లు సీఐ తెలిపారు.