పచ్చి మిర్చి ఘాటు.. ఆరోగ్యానికి మంచిదే

పచ్చి మిర్చి ఘాటు.. ఆరోగ్యానికి మంచిదే

చాలామంది కూరల్లో పచ్చి మిర్చి కనిపిస్తే చాలు.. తీసి పారేస్తారు. దాని ఘాటు అలా ఉంటుంది మరి. అయితే మిర్చి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయని.. ఫలితంగా రక్తహీనత, గుండె సంబంధిత సమస్యలను నిరోధించవచ్చని చెబుతున్నారు. అలాగే జీర్ణక్రియ, ఇమ్యూనిటీ, కంటిచూపు మెరుగుపడతాయని సూచిస్తున్నారు.