H-1B వీసా ఫీజు పెంపు.. ట్రంప్‌నకు ఎంపీల లేఖ

H-1B వీసా ఫీజు పెంపు.. ట్రంప్‌నకు ఎంపీల లేఖ

USలో H-1B వీసా ఫీజు పెంపుపై అక్కడి చట్టసభ సభ్యుల బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రకటనను పునఃపరిశీలించాలని కోరుతూ వారు ట్రంప్‌నకు లేఖ రాశారు. ఫీజు పెంపు US ఆర్థిక వ్యవస్థను, AI సాంకేతిక నాయకత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. H-1B గ్రహీతల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నందున, ఈ విధానం భారత్‌తో సంబంధాలను ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు.