'ఉపాధి హామీ క్రింద సామాజిక, వ్యక్తిగత ఆస్తులను సృష్టించాలి'

KMM: ఉపాధిహామీ పనుల క్రింద సమాజానికి, వ్యక్తులకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం రఘునాథపాలెం (M) బుడిదంపాడులో జిల్లా కలెక్టర్ పర్యటించి పనుల జాతర-2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో పూర్తయిన పౌల్ట్రీ, క్యాటిల్ షెడ్డులకు ప్రారంభోత్సవం చేశామన్నారు. ఉపాధిహామీ అనేది పని కల్పనకు చట్టరీత్యా ఉన్న హక్కని పేర్కొన్నారు.